ఏపీలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌

AP CM BABU
AP CM BABU

ఏపీలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ డేటా వినియోగం అమోఘంగా ఉందని జపాన్, భూటాన్ బృందాలు ఆంధ్రప్రదేశ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించాయి. అమరావతిలోని రియల్ టైం గవర్నెన్స్‌ను పరిశీలించాయి. ఈ సందర్భంగా  జపాన్ మంత్రి సాయిసాకు కిరాకి మాట్లాడుతూ… కొన్ని అంశాల్లో జపాన్ కంటే ఏపీలో మెరుగ్గా పనిచేస్తున్నారని చెప్పారు.. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ డేటా వినియోగం అమోఘమని మెచ్చుకున్నారు.. వినూత్న ఆలోచనలు ఆచరణలో పెడుతున్న సీఎం చంద్రబాబును ఆయన అభినందించారు. భూటాన్‌ ఐటీ మంత్రి ధీననాథ్‌ ధుంగ్యేల్‌ మాట్లాడుతూ.. టెక్నాలజీ వినియోగంలో ఏపీ ప్రభుత్వం ఆదర్శప్రాయమన్నారు. ఏపీ ఈ-పాలన విధానం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని ఆయన చెప్పారు.