ఏపీలో కుట్ర రాజకీయాలు

chandra babu naidu
chandra babu naidu

అమరావతి: ఆర్థిక రంగంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఇంతవరకు జరగలేదని, ఏపీని కేంద్రం అణగదొక్కడానికి ప్రయత్నించడమే దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఏపీలో 10.52 శాతం వృద్ధిరేటు ఉంటే.. తెలంగాణలో 9.7 శాతమే ఉందని ఆయన వివరించారు. నాలుగేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రెట్టింపు అయిందని చంద్రబాబు తెలిపారు. ఏపీలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఏపీలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే వాళ్లు పనిచేయకపోయినా గొప్పగా చెప్పుకోవచ్చని అనుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.