ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెరిట్‌ జాబితా

APPSC IMAGE
APPSC

అమరావతి: ఈ ఏడాది జులై నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షకు సంబంధించి ప్రతిభ (మెరిట్‌) జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 982 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 చొప్పున అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 1925 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. జనవరి మూడో తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించిన వేదిక వివరాలను త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. అయితే, విజయవాడలో ధ్రువపత్రాల వేదిక ఏర్పాటు చేసే అవకాశం ఉంది.