ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

 

vijayashanthi
vijayashanthi

న్యూఢిల్లీ : ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి చేస్తున్న మోసాన్ని దేశ ప్రజలకు తెలియజెప్పడంలో సీఎం చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని టీ-కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ప్రశంసించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీతో పాటు, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్థించడం హర్షణీయమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు ముక్త కంఠంతో చెప్పారని, రాహుల్ ప్రధాని అయితేనే తెలుగు ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశాన్ని కదిలించేలా దీక్ష చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ తన మద్దతు తెలపలేదని విమర్శించారు. కేసీఆర్ కు తెలుగు ప్రజల ఆకాంక్షల కంటే, మోదీ ప్రాపకమే ముఖ్యమన్న విషయం మరోసారి స్పష్టమైందని విజయశాంతి అన్నారు.