ఏపీఐఐసీ భూములు పై హైకోర్టులో పిల్

breaking news
breaking news

విజయవాడ: అర్హతలేని కంపెనీలకు ఏపీఐఐసీ భూములు కేటాయించిందని మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ శుక్రవారం హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 2వేల పేజీలతో ప్రజాప్రయోజన వాజ్యం వేసినట్లు చెప్పారు. మొదటి సెషన్‌లో కోర్టు తన వాదనలు విన్నదని.. సమయాభావంవల్ల తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు.