ఏపి స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాలు అదే నిర్ణయం తీసుకోవాలి

yanamala
yanamala

అమరావతి: సీబీఐలో ఉన్న సంక్షోభం కారణంగానే ఏపిలో సాధారణ సమ్మతిని ఉపసంహరిచామని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ సాధనం కారాదన్నారు. రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశానికి సమ్మతి ఉపసంహరణ సబబే అని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారమే చేశామని తెలిపారు. ఏపీ స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాలూ అదే నిర్ణయం తీసుకోవాలని యనమల కోరారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈ జీవో తెచ్చామని  ఆయన అన్నారు.