ఏపి భవన్‌లో కొనసాగుతున్న వైఎస్సార్సీ ఎంపీల దీక్ష

ysrcp
YSRCP

న్యూఢిల్లీ: వైఎస్సార్సీ పార్లమెంట్‌ సభ్యుల అమరణ నిరహార దీక్ష శిబిరం ఈదురుగాలులకు కుప్పకూలిపోవడంతో పార్లమెంట్‌ సభ్యులందరూ ఏపి భవన్‌లో పరుగులు తీశారు. ఈదురుగాలుతో ఒక్కసారిగా వర్షం కురవడంతో ఏపి భవన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం కుప్పకూలింది. దీంతో పార్లమెంట్‌ సభ్యులంతా ఏపి భవన్‌లోకి పరుగులు తీశారు. ఏపి భవన్‌లోనే దీక్ష కొనసాగిస్తున్నారు.