ఏపి ప్ర‌త్యేక హోదాపై త‌మిళ‌నాడులో నిర‌స‌న‌

B N
B N

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో నిరసనలు జరుగుతున్నాయి. చెన్నైలోని తెలుగుఫోరం ఆధ్వర్యంలో పలువురు తెలుగువారు నిరసనలు తెలిపారు. చేపాక్ లోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన ఆందోళనా కార్యక్రమంలో చెన్నైలోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. ఏపీలో యువతకు ఉద్యోగావకాశాలు దగ్గర కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వస్తే, వివిధ ప్రాంతాల్లో సెటిలైన వారంతా తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారని, దాంతో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని వారు వెల్లడించారు. ఇదే సమయంలో విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, హామీలను నెరవేర్చకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.