ఏపి డిప్యూటి కలెక్టర్‌గా కిదాంబి

విజయవాడః బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ఏపి డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గొల్లపూడిలోని భూపరిపాలన కమిషనర్ కార్యాలయంలో కిదాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. భూపరిపాలనా కమిషనర్ అనిల్‌చంద్ర నుంచి శ్రీకాంత్ నియామక పత్రాలు స్వీకరించారు.