ఏపి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన రద్దు
కంటి ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న నిమ్మగడ్డ
Election Commissioner Nimmagadda Ramesh Kumar
విజయవాడ: ఏపిలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నేడు పలు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన రర్దైంది. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కంటి ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆయన ఐ టెస్ట్ చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈనాటి కడప జిల్లా పర్యటనను ఆయన వాయిదా వేసుకున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రేపు జరగనుంది.
ఈ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరుగుతున్నాయి.