ఏపి ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

వైఎస్‌ఆర్‌సిపి అక్రమాలకు పాల్ప‌డుతోంది

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో త‌మ పార్టీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని, మిట్టపల్లి గ్రామ పంచాయతీ వైఎస్‌ఆర్‌సిపి అక్రమాలకు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు.

త‌మ పార్టీ అభ్యర్థి శివలక్ష్మి భర్త మంజునాథపై అక్రమ కేసు నమోదు చేశారని వివ‌రించారు. మ‌రో టిడిపి నాయకుడు మనోహర్ పై కూడా ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు పెట్టార‌ని చెప్పారు. కేసులు పెట్ట‌డంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నార‌ని వివ‌రించారు. త‌మ పార్టీ నేత‌ల‌పై పెట్టిన కేసులను వెంటనే ఉప సంహ‌రించేలా చేయాల‌ని చెప్పారు. అలాగే, మనోహర్‌కు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని కోరారు. కుప్పంలో కూడా వైఎస్‌ఆర్‌సిపి నేత‌లు గందర‌గోళం నెల‌కొల్పుతున్నార‌ని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.