ఏపి ఎంపీల తీరుతో స‌భ‌ కాసేపు వాయిదా

sumitra mahajan
sumitra mahajan

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ లోక్‌సభలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎంపీలపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు చేసే నినాదాలు ఇతర సభ్యులకు ఇబ్బందిగా ఉంది. నిరసన తెలపండి కానీ.. గట్టిగా నినాదాలు మాత్రం చేయొద్దు. దయచేసి మీరు మీ స్థానంలో కూర్చోంది. క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవడానికి వెనుకాడను’ అని స్పీకర్‌ ఎంపీలను గట్టిగానే హెచ్చరించారు. అయినప్పటికీ ఎంపీలు తగ్గకపోవడంతో సభను 11.34 నిమిషాల వరకు వాయిదా వేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తప్పెటగూళ్ల వేషధారణలో కంజరతో సభలోకి వచ్చి దాన్ని వాయించేందుకు ప్రయత్నించడం గందరగోళానికి దారితీసింది. పార్లమెంటు సిబ్బంది ఆయన్ని వారించి బయటకు పంపేశారు.