ఏపిలో వైఎస్ఆర్‌సిపితో ఎంఐఎం దోస్తి

asaduddin owisi
asaduddin owisi

అసదుద్దీన్‌ ఓవైసితో మేకపాటి గౌతమ్‌రెడ్డి భేటీ
హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసిను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆంధ్రప్రదేశ్‌ తాజా రాజకీయ పరిణామాలపై అసక్తికరమైన చర్చజరిగినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి వ్యతిరేకంగా వ్యవహరించే క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.