ఏపిలో మోది తొలి సభ వేదిక గుంటూరులోనే..!

modi
modi

modi
గుంటూరు: ఏపిలో బిజెపి నిర్వహించనున్న ప్రధాని మోది రెండు బహిరంగ సభల్లో తొలి సభకు వేదికను ఖరారు చేసినట్లు సమాచారం. నాగార్జున యూనివర్సిటీ ఎదుట బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్స్‌లో జనవరి 6న మొదటి సభ నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. అటు రాయలసీమకు, ఇటు కోస్తా నుంచి జన సమీకరణకు అవకాశం ఉండడంతో ఈ ప్రదేశాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. 5 లక్షల మందికి పైగా జన సమీకరణ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.