ఏపిలో ‘మోడి గో బ్యాక్‌’ నిరసనలు

Narendra mody
Narendra mody

అమరావతి: విజయవాడ లెనిన్‌ కూడలిలో వామపక్ష నేతలు నిరసనకు దిగారు. ప్రధాని మోడి గుంటూరు పర్యటన సందర్భంగా ఏపి వ్యాప్తంగా నిరసనలు వెల్లువుత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ వారు నిరసనలు తెలియజెస్తున్నారు మోడి గో బ్యాక్‌ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడిని ఏపిలోకి అడుగు పెట్టవద్దని టిడిపి నేతలు స్పష్టం చేశారు. ఏముఖం పెట్టుకని ఆయనవస్తున్నారని సిసిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి గుంటూరు వెంబడి రహదారిపై పెద్ద ఎత్తున మోడికి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు.