ఏపిలో ముగిసిన నామినేషన్ల దాఖలు

PARLIAMENT
PARLIAMENT

అమరావతి: ఏపిలో రాజ్యసభ నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రాజ్యసభ స్థానాలకుగాను 4 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో టిడిపి నుంచి రెండు నామినేషన్లు వెస్పార్సీపి నుంచి రెండు నామినేషన్లు ఉన్నాయి. టిడిపి అభ్యర్థులుగా సీఎం రమేష్‌, కనకమేడల నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీ నుంచి వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతి రెడ్డి నామినేషన్లు వేశారు. ఆమె వైఎస్సార్సీ డమ్మ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.