ఏపిలో మరో 67 కరోనా పాజిటివ్‌ కేసులు

1,650 కి చేరిన కరోనా భాధితుల సంఖ్య

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటలలో జరిపిన పరీక్షలలో మరో 67 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్లు ఏపి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదు అయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా నమోదు అయిన కేసుల సంఖ్య 1,650కి చేరుకుంది. కొత్తగా నమోదు అయిన కేసులలో గుంటూరులో 19, కర్నూలులో 25, కృష్ణా లో 12, విశాఖపట్నంలో 6, చిత్తూరు లో ఒక కరోనా కేసు నమోదు అయింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 491 కి చేరుకుది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా భారిన పడి మరణించిన వారి సంఖ్య 33 కు చేరుకోగా.. కరోనా భారినుంచి కోలుకున్న వారి సంఖ్య 524 కు చేరింది. ఇక ప్రస్తుతం 1,093 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏపిలో మరో 67 కరోనా పాజిటివ్‌ కేసులు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/