ఏపిలో మరో 60 కరోనా కేసులు

1,777కు చేరిన భాధితుల సంఖ్య

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. గత నాలుగు రోజులుగా వరుసగా 60కిపైగా కేసులునమోదు అవుతూ వస్తున్నాయి. నేడు కూడా మరో 60 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటలలో 7,782 మంది శాంపిల్స్‌ ను పరీక్షించగా అందులో అరవై మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపిలో కరోనా భాధితుల సంఖ్య 1,777 కు చేరుకుందని ఏపి వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదు అయిన కేసులలో కర్నూలు జిల్లాలో 17, కృష్ణా లో 14, గుంటూరులో 12 కడపలో 1, విశాఖ పట్నంలో 2, కేసులు నమోదు అయ్యాయి. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారిలో 13 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా భారిన పడి మరణించిన వారి సంఖ్య 36 కు చేరింది. మరో 729 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 1,012 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Image

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/