ఏపిలో బిజెపి నేతల రాజీనామా పర్వం

అమరావతిః ఏపీ క్యాబినెట్లో ఉన్న బీజేపీ మంత్రులు నేడు తమ పదవులకు రాజీనామా చేశారు. ఏపీ క్యాబినెట్లో మంత్రులు కొనసాగుతున్న బీజేపీ నేతలు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో వీరు రాజీనామా లేఖను అందజేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాలు చేసిన బీజేపీ మంత్రులకు టీడీపీ మంత్రులు ఆలింగనాలతో వీడ్కోలు పలికారు.