ఏపిలో ప్రచారానికి ఎంఐఎం వ్యూహం

aimim party mla's
aimim party mla’s

హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఏపిలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ప్రచారం చేయడానికి వ్యూహరచన చేస్తుంది. అధికార టిడిపికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించింది. ఏపి అసెంబ్లీ ఎన్నికలను ఎంఐఎం ప్రభావితం చేస్తుందని గతంలోనే అసదుద్దీన్‌ స్పష్టం చేశారు. ఏపిలో ఏయే జిల్లాల్లో ఎంతమంది ముస్లిం ఓటర్లున్నారు అనే దానిపై మజ్లిస్‌ నేతలు లెక్కలు తీశారు. చంద్రబాబు మస్లింలకు చేసిన అన్యాయాన్ని ప్రచారంలో విశ్లేషించనున్నారు. తెలంగాణలో కేసిఆర్‌ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ..చంద్రబాబు మోసాన్ని ఎండగట్టేలా ప్రచారం చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌ వైఎస్‌ఆర్‌సపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.