ఏపిలో పంజా విసురుతున్న కరోనా


మరో 58 మందికి నిర్ధారణ

coroana doctors

అమరావతి: ఏపిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడచిన 24 గంటలలో 6,534 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 58 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో నమోదు అయిన కరోన కేసుల సంఖ్య 1,583కు చేరుకుంది. కాగా కొత్తగా నమోదు అయిన కేసులలో కర్నూలు జిల్లాలో 30, అనంతపురంలో 7, గుంటూరులో 11, కృష్ణాలో 8, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసుల నమోదు అయినట్లు తెలిపింది. అత్యధికంగా ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 466 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా భారిన పడి ఇప్పటి వరకు 33 మంది మరణించగా.. 488 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 1,062మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/