ఏపిలో నేటి నుండి పంచాయతీ మూడో దశ నామినేషన్లు స్వీకరణ

ఉపసంహరణకు 12వ తేదీ వరకు గడువు

అమరావతి: ఏపి పంచాయతీ ఎన్నికల మూడో దశ కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 12 తుది గడువు. 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇక, ఈ నెల 13న రెండో విడత ఎన్నికలు జరగనుండగా, మొత్తం 99,241 నామినేషన్లు దాఖలైనట్టు ఈసీ తెలిపింది. సర్పంచ్ స్థానాలకు 19,399 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు స్థానాలకు 79,842 నామినేషన్లు దాఖలయ్యాయి. 8న ఉపసంహరణ గడువు అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్టు ఈసీ వివరించింది.