ఏపిలో దుష్టపాలన సాగుతుంది

Vijayasai reddy
Vijayasai reddy

వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం దుష్టపాలన సాగిస్తుందని వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు చేస్తున్న అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. తిత్తీ తుఫాను బాధితుల పరిహారం అందజేయడంలో పచ్చ చొక్కా నేతలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని అన్నారు. తిత్తీ తుఫాన్‌ విద్వంసంలో కొబ్బరి, జీడి, వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే, బాధితులకు అందాల్సిన పరిహారాన్ని టిడిపి నేతలు హైజాక్‌ చేస్తున్నారన్నారు. సెంటు భూమి లేనివారు సైతం బాధితులమంటూ 150-200 కొబ్బరి చెట్టు కోల్పోయినట్లు రాయించుకున్న సంఘటనలు కోకోల్లలుగా ఉన్నాయన్నారు. 0.30 సెంట్లు భూమి ఉంటే మూడు ఎకరాలు అంటూ నమోదు చేయించుకుని, ఎకరాకి 60 కొబ్బరి చెట్ల చొప్పున మూడు ఎకరాలకు 180 చెట్లు చూపించి రూ.2.70లక్షల పరిహారం పొందారని అన్నార. ఈవిధమైన కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు పరిహారాన్ని దోచేశారని మండిపడ్డారు. వీటితో పాటు ఎన్‌టిఆర్‌ విద్యోన్నతి కోచింగ్‌ సెంటర్లు కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరించదని అన్నారు. చాలా మంది అభ్యర్థులు చాలా దూరంగా కోచింగ్‌ సెంటర్లకు కేటాయించడం దారుణమన్నారు. అభ్యర్థులు తమకు దగ్గర్లోని హైదరాబాద్‌, విజయవాడ సెంటర్లు కోరుకుంటే వారికి తెలుగుమీడియం సౌకర్యం లేని ఎక్కడో దూరంలో ఉన్న ఢిల్లీలో సెంటర్లు కేటాయించారంటూ ట్వీట్టర్‌ వేదికగా మండిపడ్డారు.