ఏపిలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ

 

AP
AP

అమరావతి: ఏపిలో ఓటర్ల తుది జాబితాను ఈరోజు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. ఏపిలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటుర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్‌ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంద్రి ఓటర్లు ఉన్నారు.
జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య:
•శ్రీకాకుళం 20,64,330
•విజయనగరం 17,33,667
•విశాఖ 32,80028
•తూ.గో 40,13,770
•ప.గో 30,57,922
•కృష్ణా 33,03,592
•గుంటూరు 37,46,072
•ప్రకాశం 24,95,383
•నెల్లూరు 22,06,652
•కడప 20,56,660
•కర్నూలు 28,90,884
•అనంత 30,58,909
•చిత్తూరు 30,25,222