ఏపిలో డీఎస్సీ దరఖాస్తు గడువు పెంపు

ap logo
ap

అమరావతి: ఏపిలో డీఎస్సీ దరఖాస్తు గడువును అధికారులు ఒకరోజు పెంచారు. దరఖాస్తుకు తుది గడువును ఈనెల 17నుండి 18కి పెంచారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో చేసిన తప్పులను సరిచేసుకోవడంతో పాటు బీఈ, బిటెక్, బీబీఏ తదితర కోర్సులు చదివిన అభ్యర్థులకు కూడా డీఎస్సీకి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో గడువు పొడిగించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ నెల 18లోగా ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు.. .