ఏపిపిఎస్సీకే వ‌ర్సిటీ నియామ‌కాలు

APPSC IMAGE
APPSC

అమ‌రావ‌తిః విశ్వవిద్యాలయాల్లో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించేందుకు వీలుగా ప్రభుత్వం శాసనసభలో బుధవారం బిల్లు ప్రవేశ పెట్టిం ది. విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల(ఈసీ) తీర్మానం ద్వారా పరీక్ష నిర్వహించమని కోరినప్పుడే ఆ బాధ్యతను ఏపీపీఎస్సీ చేపడుతుంది. వర్సిటీ చట్టాల ప్రకారం.. ఆయా వర్సిటీలే టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉంది. కానీ వర్సిటీలు పరిశోధన, పరిపాలనతో సహా మరింత శ్రద్ధ వహించాల్సిన ఉండటం, గతంలో వర్సిటీల్లోని ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఇలా నిర్ణయించింది.