ఏపికి సాయం నిరాకరించిన కేంద్రం

Chandrababu
Chandrababu

విజయవాడ: పోమవారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా అదరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఉద్దేశపూర్వకంగానే సాయం చేయడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.తితలీ తుఫాను బాధితులకు పూర్తిస్థాయి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. మోడి పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, స్వతంత్ర వ్యవస్థలను వాడుకుంటున్నారని బాబు ఆరోపించారు. ప్రశ్నించినవారిపై సీబిఐ, ఐటీ పేరుతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహించారు. కేంద్రం చేసిన మోసాన్ని తెలియజేసేందుకు బిజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.జీఎస్టీతో ధరలు పెరిగి నోట్ల రద్దుతో ఏం సాధించారో చెప్పాలని బాబు డిమాండ్‌ చేశారు,