ఏపికి మోడి ఉదారంగా సాయం అందించారు

Amith Shah
Amith Shah

విజయనగరం: ఏపిలో బిజెపి చేపట్టిన బస్సు యాత్రను ప్రారభించాడానికి బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడాతు ప్రధాని మోడి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏపికి ఉదారంగా సాయం అందించిందని ఆయన తెలిపారు. ఏపికి అన్యాయం చేసిందంటై రాష్ట్రంలో అధికార టిడిపి,ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ఉదారంగా సాయం అందించిందని వెల్లడించారు. కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలను, ప్రాజెక్టులను, ఏపి కు చేకూరిన ప్రయోజనాన్ని వివరించారు. సభలో ఆయన మాట్లాడుతూ కీలకమైన 14అంశాల్లో పది పూర్తి చేశామన్నారు. గుంటూరుకు ఎయిమ్స్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశామని వెల్లడించారు. విశాఖలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ ఎడ్యూకేషన్‌, పెట్రోలియం విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం వంటి కీలక విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. జాతీయస్థాయిలో ఖ్యాతిగాంచిన 20 సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చామని వెల్లడించారు. రెవెన్యూ, ఆర్థిక లోటును కూడా కేంద్రం తరఫున భర్తీ చేసినట్లు అమిత్‌షా తెలిపారు. డిస్ట్రిక్ట్ మినరల్‌ ఫండ్‌ కింద రూ.6100 కోట్లు, ముద్ర యోజన కింద రూ.21వేల కోట్లు, భారత్‌మాల ప్రాజెక్టు కింద రూ.44వేల కోట్లు ఇలా మొత్తం అన్నీ కలిపి రూ.5,56,985కోట్లు రాష్ట్రానికి సాయంగా అందజేశామని చెప్పారు.