ఏపికి జరిగిన అన్యాయంపై అందరం కలిపి పోరాడాలి

Pavan kalyan
Pavan kalyan

యవాడ: జనసేన అధినేత పవన్‌ ఉండవల్లి నేతృత్వంలో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తరువాత ఆయన మాట్లాడుతు ఏపికి జరిగిన అన్యాయంపై అందరం కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రనికి ఎన్ని నిధులు రావాలనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని అందరూ అంగీకరించారని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని కోరారు. ఈ సమయంలో కూడా మనం పోరాడకపోతే ఇంకా ఎప్పటికీ న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు.