ఏపికి కేంద్రం అండగా నిలబడాలి: ఏపి సియం

AP CM CHANDRA BABU
AP CM CHANDRA BABU

అమరావతి: విభజన తర్వాత ఏపి రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందని అయినప్పటికీ ఎన్నో సంక్షేమ కార్యకమ్రాలు చేపడుతున్నామని ఏపి సియం చంద్రబాబు అన్నారు. పొరుగు రాష్ట్రాలతో ఏపి ఎదిగే వరకు కేంద్రం ఓపిక పట్టాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం సహకరించడం లేదని మనం ఇంట్లో కూర్చుంటే ప్రజలు సహించరన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపికి నిధులు ఇచ్చారని, విభజన వల్ల నష్టపోయిన ఏపికి ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదని సియం అన్నారు. మార్చి నాటికి పోలవరం కాపర్‌ డ్యామ్‌ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే మే నాటికి పోలవరం పూర్తి చేయాలన్నది లక్ష్యం అని ,నదుల అనుసంధానంతో నీటిని వినియోగంలోకి తెస్తామని ఈ సందర్భంగా సియం తెలిపారు.