ఏదైనా ప్రేమతోనే సాధ్యం

             ఏదైనా ప్రేమతోనే సాధ్యం

cute
cute

నిన్నేప్పుడూ అభిమానిస్తూనే ఉంటారు. ఈ శరీరంలో ఊపిరి ఉన్నంతవరకూ నిన్నే తలంచుతూనే ఉంటారు. కళ్లుమూసినా, తెరచినా నీ రూపమే దర్శనమిస్తుంటుంది. ఈరెండింటికి మధ్య ఉన్న సమయంలో కూడా నిన్నే గుర్తుకు తెచ్చుకుంటాను. మనిషికి ప్రేమే ఊపిరి. ప్రేమలేని వాడు జీవితంలోని మధురిమలకు దూరం కావాల్సిందే. ఆనందం ఎక్కడో రాదు, తృప్తి ఎక్కడో లేదు. మన కౌగిట్లోనే ఉంది. చిన్నచిన్న పదాలతో, చిన్నిచిన్ని మాటల్లో ప్రేమను వ్యక్తం చేసుకోవడంలోనే అసలైన మధురానుభూతి దాగుంది.

ఒక్క చిరునవ్ఞ్వ చాలు ముఖం ఎంత కాంతివంతంగా వెలిగిపోతుంది. కోపం వచ్చినప్పుడు ఎంత అసహ్యంగా ఉంటుందో ఒక్కసారైనా గమనించారా? కాని మన ముఖాన్ని ఇలాగ ఉంచుకోవడమే ఇష్టం కాబోలు ఎప్పుడు సీరియస్‌గానే ఉంటాం. కష్టాలు వొచ్చినప్పుడు కన్నీరు వొలికిన పుడు జీవితాన్ని విసుక్కున్నా, చీదరించుకునాన్న లోలోతుల నుండి ప్రేమిస్తూనే ఉంటాం.

అసలు ప్రేమ లేని చోట విసుక్కోవటాలు, కసురుకోవటాలు, కోపగించుకోవటాలు, మథనపడటాలు ఉండవ్ఞ కదా! ఈ ప్రేమే ఆశను చిగురింప చేస్తుంటుంది. నేటి చిగురింతతో రేపటిని పచ్చగా చూస్తుంటుంది. ఇలా పచ్చదంతో పరవశించటం అందరూ చేసే పనే. అయితే ఆ పరవశం సామాన్యంగా సాదాసీదా జీవ్ఞలందరిదీ. కొందరికి మాత్రం ఇటువంటి జీవితంలో కిక్‌ కనిపించదు. థ్రిల్‌ ఉండదు. వావ్‌ అనిపించదు. పైగా జీవన సరళిలోని ఆలోచనలేవీ మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించవ్ఞ. మనల్ని గెలిపించకపోగా మరొకరిని గెలిపించే అవకా శమేలేని జీవితం వల్ల ప్రయోజనం శూన్యం అన్నది అటు వంటివారి సిద్ధాంతం.

వీరి దృష్టిలో మనం బ్రతకాలి మరికొందరిని బ్రతికించాలి. బ్రతుకుకు అర్థం అదే. జీవితానికి నిర్వచనం అదే. నిజానికి తాను గెలిచి, పది మందిని గెలిపించగలవాడే విజేత. తాను గెలవాలను కోవటం పర్సనల్స్‌గా, పర్సనాలిటీపరంగా అంగీకరమే. అయితే తాను గెలిచి పదిమందినీ గెలిపించటం నోబుల్‌ కారెక్టర్‌ అవ్ఞతుంది. ఆథంటిక్‌ లీడర్‌షిప్‌ అవ్ఞతుంది. అంటే గెలుపులోను స్వార్థం, ప్రామాణికత ఉంటుందన్న మాట. మొత్తానికి ఇంటర్నేషనల్‌గానే కాదు ఇంటర్నల్‌గా తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలనుకునేవారు సైతం ఈ మైండ్‌తో జీవించటం తెలుసుకోవాలి.

చదువ్ఞ చదువ్ఞకు తగ్గ ఉద్యోగం అందచందాలకు తగ్గ భాగస్వామి కన్న పిల్లలు వొంటిబట్టిన పెద్దరికాలు సామాజికంగా గౌరవప్రపత్తులు జీవితం సినిమాటిక్‌గా సాగి పోతుంటుంది. సెంటిమెంట్‌ పేరుతో స్వార్థంతో బిగుసుకు పోతుంటుంది. ఎగ్జయిట్‌ అయి లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌తో ఎదగలేక పోతుంటుంది. కాస్త రియలిస్టిక్‌గా ఆలోచించండి. అమ్మానాన్నలు కన్నారు కాబట్టి మనల్ని పెంచిపెద్ద చేస్తారు. పాఠాలు చెప్పే విద్యాసంస్థలు డిగ్రీలు చేతిలో పెడ్తాయి.

ఉద్యోగమిచ్చిన ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు జీతాలిస్తూ, విరమణానంతరం సైతం మన జీవితాన్ని ఆర్థికంగా కొంతవరకు మోస్తుంటాయి. కన్నపిల్లలు కాస్త ఆర్థికంగాను ఇంకాస్త హార్ధికంగాను సహకరిస్తుంటారు. ఇంతేనా జీవితం? ఆర్థికంగాను హార్ధికం గాను అన్నివైపుల నుండి పుచ్చుకుంటున్నామే తప్ప ఇచ్చుకుంటున్నామా? పోనీ కొద్దోగొప్పో ఎంతో కొంత వీరందరికీ వెలగబెడ్తున్నాం అనుకున్నా మనకు తెలియనివారికి మనం ఎలా సాయపడగులుగుతున్నాం?

మన జీవితం వారికి ఎలా ఉపయోగపడుతోంది? అనుకున్నప్పుడు మనం తల ఎత్తుకోగలమా? తలదించుకోగలమా? దించిన తలను ఎత్తగలగటమే జీవితం. జీవితం సాఫీగా సాగిపోతోందని మనకు మనమే కితాబు ఇచ్చుకున్నంత మాత్రాన చరిత్ర సృష్టించినట్టు కాదు. మెరుస్తున్న రోడ్డుపైన ప్రయాణం సాఫీగానే సాగిపోతుంటుంది.