ఏడాదిలోపు పిల్లలున్నవారికి ప్రతిరోజు శ్రీవారి దర్శనంకు అనుమతి

TTD EO  Anil Kumar Singhal
TTD EO Anil Kumar Singhal

ఏడాదిలోపు పిల్లలున్నవారికి ప్రతిరోజు శ్రీవారి దర్శనంకు అనుమతి

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భఖ్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకంటున్నట్టు తితిదే ఇఒ అనికుమార్‌సింఘాల్‌ అన్నారు. శుక్రవారం ఆయన ‘డయల్‌ యువర్‌ ఇవో కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల లోపు పిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.. వీరికి నెలలో రెండురోజులుండే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.. జూలై 19, 20తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అనుమతిస్తామన్నారు..ఏడాది వయసులోపు ఉన్న తల్లిదండ్రులు, రోజూ దర్శన అవకాశం కొనసాగిస్తామని తెలిపారు.. దివ్యాంగులు, వృద్ధులకు జూలై 15, 25న రోజుకు 4వేల మందికి దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.