ఏడాదిన్నరలోపే ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తాం

Chandrababu
Chandrababu

అమరావతి: అమరావతిలో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి సిఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు బసవతారకం మరణం తర్వాత ఎన్టీఆర్ మనసులో కలిగిన ఆలోచనే క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణమని ఆయన అన్నారు.అప్పట్లో ఇండియాలో క్యాన్సర్‌కు సరైన చికిత్స లేదని, చెన్నై, ముంబాలో ఆస్పత్రులు ఉన్నాయని అన్నారు. వ్యాధి ముదరడంతో బసవతారకం చికత్స కోసం అమెరికా కూడా వెళ్లారని అయినా బాధ తగ్గలేదని కణాల క్యాన్సర్‌తో ఆమె చనిపోయారని చంద్రబాబు తెలిపారు. దీంతో ఎన్టీఆర్‌కు క్యాన్సర్ ఆస్పత్రి పెట్టే ఆలోచన వచ్చిందని చంద్రబాబు తెలిపారు.ఏడాదిన్నరలోపే ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో్ నందమూరి బాలకృష్ణ, స్పీకర్ కోడెల శివప్రసాద్, టీడీపీ నేతలు పాల్గొన్నారు.