ఏడడుగులకు ఏడర్థాలు

SHADIFFF
Wedding

ఏడడుగులకు ఏడర్థాలు

వివాహం ఒక భౌతిక అవసరమే కాదు, సామా జిక బాధ్యత కూడా అని సామాజికులు నిర్వచిం చారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల సాధనకు వివాహమే మార్గదర్శి అని ఆధ్యాత్మికులు ప్రవచించారు. వివాహ వేడుకలోని సప్తపదిలో నూతన దంపతులు వేసే ఏడడుగులకు ఏడు అర్థాలున్నాయి. తొలి అడుగు శరీరబలంకోసం, రెండో అడుగు మానసికబలం కోసం, మూడో అడుగు కష్టమైనా, సుఖమైనా కలిసి బతకడం కోసం, నాలుగో అడుగు ఆరోగ్యం కోసం, అయిదో అడుగు పశుసంపదల వినియోగం కోసం, ఆరో అడుగు రుతుసంపదలను అనుగ్ర హించడం కోసం, ఏడో అడుగు హోమాన్ని చేసే అవధూతల ఆశీర్వాదం, అనుగ్రహం కోసం. ఇలా వైవాహిక బంధానికి పునాది అయిన సంప్రదాయాల వల్లనే మన వివాహ వ్యవస్థను అన్ని దేశాల వారూ గౌరవిస్తున్నారు. కొంతమంది విదేశీయులు వీటిని అనుసరిస్తున్నారు కూడా. నాటి పురాణ యుగం నుంచి నేటి పరమాణు యుగానికి వస్తే వేగవంతమైన బతుకు చక్రంలో సాగుతున్నది వివాహ బంధాలు. కొంతమంది విషయంలో తెగిపడి, విడివడి చేదు జ్ఞాపకంగా, అపశ్రుతిలా మారడం, మనం చూస్తున్నాం.ధర్మమార్గంలోనూ, అర్థసం పాదన లోనూ, దాని వినియోగంలోనూ దైహిక మానసి క కోర్కెలను సాధించడంలోనూ నా సహధర్మ చారిణిని అతిక్రమించను. వేరొకరితో కలిసి నన్ను అంకితం చేసుకోను అను వివాహ ప్రతిజ్ఞ దంపతులు మనస్సులో బలమైన ముద్రవే యాలి. స్వచ్ఛమైన ప్రేమ, ఒకరి పట్ల మరొకరికి నమ్మకం సడలని విశ్వాసం పునాదిగా ఏర్పడిన వివాహ బంధం సామరస్యంగా బలపడినప్పుడే ఆ దాంపత్యం నిండు నూరేళ్లు శుభప్రదంగా ముందుకు సాగుతుంది. నిండునూరేళ్లు మమతానురాగాల పంటగా కలిసి యుండుటకు కారణాలుగా పెద్దలు చెప్పారు.