ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి సమస్య

ప్రజావాక్కు
                   ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి సమస్య

Water problem
Water problem

ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి సమస్య
విశాఖ జిల్లాలోని పలుఏజెన్సీ గ్రామాలలోని గిరిజనులు తాగు నీటి కోసం తీవ్రంగా అల్లాడుతున్నారు. వేసవి ప్రభావంతో స్థానికంగా జలవనరులన్నీ ఇప్పటికే వట్టిపోయాయి. కాసిన్ని నీళ్లజాడ ఎక్కడ కనిపించినా గుంపులుగా వెళ్లి తాగునీటిని సేకరించి ఇంటికి తెచ్చుకుంటున్నారు. కొన్ని ప్రదేశాలలో గిరి జనులు నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. గత్యంతరం లేకపోవడంతో సురక్షితం కాని ఈ నీటినే తాగి గిరిజనులు అనారోగ్యం పాలవ్ఞతున్నారు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరు కూడా అధ్వాహ్నంగా ఉంది. గతంలో 104 వాహనాల ద్వారా వారానికి ఒకసారి ప్రతిగిరి జన గ్రామానికి వెళ్లి వైద్యసేవలు అందించేవారు. గత మూడేళ్ల నుండి ఈ సర్వీసులు కూడా ఆగిపోయాయి. జిల్లా యంత్రాం గం తక్షణం స్పందించాలి. గిరిజన ప్రాంతాలలో ప్రజల తాగునీటి అవసరాలను వెంటనే తీర్చాలి.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

విద్యావిధానంలో సంస్కరణలు
గత సంవత్సరంలో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల ప్రద ర్శన పేలవంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరం లో వివిధ సంస్కరణలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంకావడం హర్షణీయం. ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రారం భమయ్యే నాటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, సకాలంలో అందించేందుకు విద్యాశాఖ తగు చర్యలు తీసుకో వాలి. పాఠశాలలో పరీక్షలు ఏయే కాలంలో నిర్వహించనున్నా రో వివరాలను అకడమిక్‌ కాలెండర్‌రూపంలో ముందుగా తెలి యచేయాలి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు సకాలంలో తీసుకొనందున క్రితం సంవత్సరం విద్యార్థులలో తీవ్ర గందరగోళానికి దారి తీసింది.
-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు జిల్లా

అధికారుల బాధ్యత
సినిమా థియేటర్లలో ఇంటర్వెల్‌ సమయంలో ప్యాక్‌ చేసిన తినుబండారాలపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధర కంటే పైసా అదనంగా వసూలు చేసినా సినిమా థియేటర్లు, మల్టీపెక్స్‌ల యాజమాన్యాలకు జరిమానా విధిస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్‌ సభర్వాల్‌ హెచ్చరించారు. అయినా థియేటర్లలో అన్ని చోట్లా యాజమాన్యాలు వారి ఇష్టానుసారం ధరలు పెంచి అమ్ముకుంటున్నా ప్రేక్షకులు కిమ్మనటం లేదు. స్థానిక అధికారులు ఇలాంటి థియేటర్లపై నిఘా ఉంచాలి.
-జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

అమెరికాతో జాగ్రత్త
ఇరాన్‌ నుండి చమురు దిగుమతులను పూర్తిగా ఆపివేయాలని భారత్‌పై అగ్రరాజ్యం చేస్తున్న ఒత్తిళ్లు తీవ్ర ఆందోళన కలిగి స్తున్నాయి. సౌదీఅరేబియా, ఇరాక్‌ల తర్వాత మూడవ అతిపెద్ద చమురు సరఫరా దారుగా ఉన్న ఇరాన్‌తో చమురు, వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోకపోతే నవంబరు నాలుగు తర్వాత భారత్‌పై ఆర్థిక ఆంక్షలు తప్పవని ట్రంప్‌ ప్రభుత్వం బెదిరించడం అగ్రరాజ్యం దురహంకారాన్ని దుర్నితిని బయ టపెడుతోంది. అమెరికా పేరుతో ఇతర దేశాల నుండి తమ దేశానికి దిగుమతి అయ్యే అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన అమెరికా ఇప్పుడు పశ్చిమాసియా లో చమురు నిల్వలపై పట్టుకోసం ఆడుతున్న ప్రమాదకరమైన ఆధిపత్య క్రీడలో భారత్‌ను పావ్ఞగా వాడుకోవాలని, ఈ క్రమం లో అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను ట్రంప్‌ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది.
-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

మహిళలకు రక్షణ లేదా?
ప్రభుత్వం ఎన్ని కఠినమైన శిక్షలను ప్రకటించినా అబలలపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యందేశంలో అనేక చోట్ల మహి ళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారి బాలికలనూ వదలకపోవడం సిగ్గుచేటు. బాలలూ, వృద్ధులూ కూడా అత్యాచారా నిందితులు కావడం మరింత సిగ్గుచేటు. ద ేశంలో అన్నిసమస్యల కన్నా అతిపెద్ద సత్వరం పరిష్కరించా ల్సిన సమస్య మహిళలపై దాడులు. మహిళలపై అత్యాచారా లు, వేధింపులు, ప్రేమపేరుతో వేధింపులు, దాడులు పెరు గుతున్నాయి. అమ్మ స్వరూపమైన స్త్రీకి రక్షణ కరవైంది. మహి ళలను వేధించిన, వారిపై లైంగిక దాడులు చేసిన వారు ఎవ రైనా బాలురైనా, వృద్ధులైనా ఎవరైనా సరే వారి నేరం రుజు వైన తక్షణం వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్‌

అక్రమ కట్టడాలను ఆపాలి
పలు కాలనీలలో రోడ్లు ఇరుకుగా ఉంటాయి. కొత్తగా భవనాలు నిర్మించుకునేవాళ్లు కొందరు రాజకీయ అండదండలతో యధేచ్ఛగా రోడ్డును ఆక్రమించుకొని అక్రమ కట్టడాలకు పాల్ప డుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ప్రతిచోట్ల కనబడుతోంది. ఇంత జరుగుతున్నా అటు మున్సిపాలిటీ వాళ్లు కానీ, ఇటు గ్రామపంచాయతీవాళ్లు కానీ కన్నెత్తి చూడరు. అదే నిరుపేదలు అప్పుతెచ్చుకొని కట్టుకుంటున్న ఇళ్లపైన నిఘాపెట్టి పక్షిలా వాలిపోతారు.
-కాయల నాగేంద్ర, హైదరాబాద్‌