ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌కై సుప్రీంలో పిటీషన్‌

SUPREME COURT
SUPREME COURT

హైదరాబాద్‌ :ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనను తెలంగాణ సర్కార్‌ చేస్తోంది. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలులో రెట్రోస్పెక్ట్‌ నిబంధన ఎత్తివేయాలని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు హైకోర్టుకు వెళ్లాయి. అయితే ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టే వేకెట్‌ చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు పిటీషన్‌ రూపొందించాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావును ఆదేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈమేరకు సుప్రీంకోర్టులో వాదించేందుకు ఢిల్లీలో ఒక సీనియర్‌ న్యాయవాదిని సిద్దం చేసుకోవాలని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది.