ఏకాంతంలోనే ఏకాగ్రత

jesus
jesus

ఏకాంతంలోనే ఏకాగ్రత

చాలా విషయాల్లో మనం వాక్యానుసారంగా జీవించడంలో విఫలమవ్ఞతున్నాం. అసలు వాక్యాన్ని చదవడంలో కానీ, చదివిన వాక్యాన్ని గుర్తుంచుకుని, ఆ విధంగా పయనించాలని, లేదా వాక్యాన్ని విన్నప్పుడు దానిప్రకారం జీవించాలనే స్పృహ కూడా ఉండదు. మనం క్రైస్తవ్ఞలం అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ క్రీస్తులా జీవించాలన్నా, ఆయన చెప్పిన బోధనల ప్రకారం ప్రవర్తించాలంటే మాత్రం అది అసాధ్యమని అనుకుంటాం. అందుకే ప్రతివిషయంలోను మనకు ఇష్టమైన విధంగా జీవిస్తున్నాం. ఉదాహరణకు ‘నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును (మత్తయి 6:3,4) అని కొండమీద యేసుప్రభువ్ఞ మొట్టమొదటిసారిగా ప్రసంగిస్తూ ఈ విషయాన్ని చెప్పాడు.

ఎంతమంది దానధర్మాలను రహస్యంగా చేస్తున్నారు? చాలాకొద్దిమంది మాత్రమే తాము ఏది చేసిన, అది దేవ్ఞడికి మహిమకరంగాను, రహస్యంగా చేస్తుంటారు. అనేకులు సంఘాలకు, చర్చిలకు ఏదైనా ఇస్తున్నప్పుడు తమ గురించి అందరూ చెప్పుకోవాలని, అనేకులకు తెలియాలనే తాపత్రయమే కనిపిస్తుంది తప్ప, ప్రభువ్ఞ దీన్ని రహస్యంగా చేయమన్నాడనే ఆలోచన వ్ఞండదు. అలాగే ప్రార్థన విధానం కూడా రహస్యంగా ఉండాలని దేవ్ఞడి కోరిక మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞ కూడా. ‘నీవ్ఞ ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును (మత్తయి 6:6). అనేకులు ‘నేను వేకువజామున 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను, 4 గంటలకు లేచి చేస్తాను, ఇంతసేపు చేస్తాను, ఇన్నిసార్లు చేస్తాను అని తమ ప్రార్థనావిధానాన్ని గురించి గొప్పగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రభువ్ఞ రహస్యంగా ఉండాలని చెబితే, వీరేమో టాం..ంటాం..గా చాటించుకుంటారు. రోజుకు మూడుగంటలు లేదా గంటసేపు చేస్తానని బూర ఊదుకుంటారు. ఎందుకంటే తమ ప్రార్థనా విధానం ద్వారా మనుష్యులముందు గొప్పగా ఉండాలనే ఆకాంక్ష అంతర్గతంలో గూడుకట్టుకుని ఉంటుంది. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు కూడా మన ఉపవాసాన్ని రహస్యంగా ఉంచాలని ప్రభువ్ఞ ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ‘నీవ్ఞ ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును (మత్తయి 6:17,18). మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికీ చెప్పకూడదు. సంఘంలో ఉపవాస ప్రార్థనాసహవాస సమయంలో ఉపవాసంతో ఉన్నాని, ఏకాంత ప్రార్థన సమయంలో ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడాలి.

ఉపవాసంతో ఉన్నానని, ఆఫీసులో, ఇతర ప్రాంతాల్లో బూర ఊదినట్లుగా చెప్పుకోకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువ్ఞ మన కానుకలు, ప్రార్థన, ఉపవాసం (గివింగ్‌, ప్రేయింగ్‌, ఫాస్టింగ్‌) ఈ మూడింటిని రహస్యంగా చేయాలనే విషయాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నారో ఆలోచించాలి. వీటిని మనం ఎంత రహస్యంగా ఉంచి, ప్రవర్తిస్తుంటామో దేవ్ఞడు అంతగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. కొన్నిసార్లు దేవ్ఞడి పరిచర్యనిమిత్తం వేకువజామున నిద్రమేల్కోవాల్సి రావచ్చు. ఆహారం, స్నాక్స్‌ తినేందుకు కూడా సమయం ఉండకపోవచ్చు. అయితే ఈ విషయాలను గొప్పగా తోటి విశ్వాసులతో పంచుకుంటూ, మనమెంతో గొప్పవారమని, గొప్పశక్తిపరులమని విర్రవీగుతుంటాం. ఇలా చేస్తే, దేవ్ఞడి నుంచి ప్రతిఫలాన్ని పొందలేం. కాబట్టి ఇకనుంచైనా మన ప్రార్థన, ఉపవాసం, కానుకల్ని రహస్యం ఉంచి, మనుష్యుల నుంచి కాకుండా, దేవ్ఞడి నుంచి ప్రతిఫలం పొందేందుకు ప్రయత్నిద్దాం. ఇది దేవ్ఞడి విన్నపం కాదు ఇది ఆయన ఆజ్ఞ కనుక, తప్పనిసరిగా పాటిద్దాం. దేవ్ఞడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక.

– పి.వాణీపుష్ప