ఏకాంతంతో మానసిక ప్రశాంతత

lady
lady

ఏకాంతంతో మానసిక ప్రశాంతత

జీవితంలో ప్రతిమనిషి అప్పుడప్పుడు ఏకాం తంగా ఒంటరిగా సమయం గడపా లనుకుం టారు. ప్రత్యేకంగా మహిళలు ఏకాంతంగా గడపవ లసిన అవసరం ఎంతయినా ఉంది. ముఖ్యంగా గర్భినీ స్త్రీలకు ప్రశాంత వాతా వరణం చాలా అవసరం. మహిళలు ఇంటా, బయటా, పిల్లలతో, పనులతో సతమ తమ య్యే, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావ్ఞన చిరాకుల నుండి ఉపశమనం పొందేందుకు ఏకాంతత చాలా అవసరం. బాలికలూ, యుక్త వయసు కలిగిన యువతులు ఏకాంతత పాట్‌ించడం వలన మానసిక, ఆరోగ్య సంబంధిత రుగ్మతల నుండి బయట పడవచ్చు. రకరకాల సమస్యలతో బాధపడు తున్న వారికి ఏకాంతత బాగా ఉపయోగప డుతుంది. ఏకాంతత ఒంటరితనం పాటిం చడం వల్ల మనిషికి ప్రశాంతత, సంతోషాలు కలుగుతాయి. అలాగే విభిన్నమయిన సమస్య లకుపరిష్కార మార్గా లు దొరుకుతాయి. సాధా రణంగా వ్యక్తులు ఏకాంత సమాయల్లో పుస్తక పఠనం గావిం చడం, సంగీత శ్రావణం, గత స్మృతులను నెమరువేయడం లాంటివి చేస్తారు. మనిషి ఎంతోకొంత సమయం ఏకాంతంగా గడపడం వల్ల వ్యక్తి యొక్క ఔన్నత్యం పెరగుతుంది. ప్రశాంతమ యిన వాతావ రణంలో ఏకాంత సమ యాల్లో చేసే పనులు, కార్యక్రమాలు మనిషికి తీపి జ్ఞాపకాలుగా మి గులుతాయి. ఏకాంత సమయాల్లో చేసే పనులకు స్పష్టత ఉంటుంది. అలాగే మనిషికి బద్ధకత్వం తగ్గి హుషారు తనం పెరుగుతుంది. ఏకాంత సమయపు నిర్ణయాల వల్ల మనిషి లక్ష్యాలకు, గమ్యాలకు చేరువవ్ఞతారు. ఏకాంత సమయాల్లో మనిషి మేథాశక్తి చురుకుగా పనిచేస్తుంది. ఆ సమయాల్లో నెమ రువేసే సంఘటనలు నివ్చలంగా నాటుకు పోతాయి. ప్రతికూల వాతావరణాలు, ఆవేశ భరిత సంధర్భాలలో ఏకాంతత చాలా అవసరం. ఏకాంతత పాఠించడం వల్ల మనిషికి విశ్రాంతి కలుగుతుంది. ఏకాంతత మనిషికి ఒక ఔషధంలా పనిచేసి మానసిక రుగ్మ తలను తొలగించి మనిషి మూడ్‌ను మార్చి చైతన్య వంతులను చేస్తుంది. కావ్ఞన ప్రతి మనిషి కొంత సమయాన్ని ఏకాంతతో గడుపు తూ ప్రశాంతగా, హాయిగా జీవిచడం వల్ల ఆరోగ్యంగా ఉల్లా సంగా ఉంటారు.

డి. చాంద్‌బాషా