ఏకమై పోరాడితూ గెలుపు సాధ్యమే

ఏకమై పోరాడితూ గెలుపు సాధ్యమే


మానస ఆరునెలల గర్భిణీ. అప్పటికే ఆమెకు ఎనిదేళ్ల కూతురు వ్ఞంది. రెండోసారి ఆడపిల్లే పుడుతుందని, భర్త, అత్త, ఆడపడుచులు ఆమెను వేధించసాగారు. స్కానింగ్‌ తీయించుకోమని, బిడ్డ ఆడామగా తెలుసుకోవాలని ఆమెను టార్చర్‌కు గురిచేసారు. నిత్యనరకాన్ని చూపించారు. రోజురోజుకు వేధింపులు అధికం కావడం వల్ల ఆమె ఆ బాధను భరించలేక ఎనిమిదవ నెలలో చెరువ్ఞలోపడి ఆత్మహత్యకు పాల్పడింది. మానస, ఆమె కడుపులో ఎదుగుతున్న బిడ్డ మరణించారు. ఈ చావ్ఞకు కారణం ఎవరు? ఆడపిల్లలంటే ఇంత చిన్నచూపా? అసలు మనం ఏ నాగరికతలో జీవిస్తున్నాం? హైటెక్‌ టెక్నాలజీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నది? ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి భావాలు వ్ఞన్న మనుషులు వ్ఞన్నారా? అనిపిస్తుంది. ఆమె చేసిన పాపం ఏంటి? ఒక్కరోజు ఇల్లాలు జ్వరం వచ్చి మంచాన పడితే ఎక్కడి వస్తువ్ఞలు అక్కడే, వంటిల్లు చిందరవందరగా, అపరిశుభ్రంగా పడివ్ఞంటాయి. అసలెందుకు చావాలి? ఆడపిల్ల అంటే చాలామందికి చిన్నచూపే. హింసించడం తమ హక్కుగా భావిస్తారు. మహిళలు కూడా ఈ హింసను కొందరు మౌనంగా భరిస్తే, మరికొందరు విడాకులతో వేరైపోతున్నారు. చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అందరికీ దీన్ని తెలుసుకునేందుకు సమానమైన హక్కులను ఇచ్చింది రాజ్యాంగం. మహిళలపై హింస రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనికి కారణం వెనకబాటుతనమే. మనకు కొన్ని చట్టాలున్నాయి. విజ్ఞానం అందుబాటులో ఉంది. చాలామంది మహిళలు విద్యావంతులవుతున్నారు. మహిళలు బయటికి వచ్చి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మహిళలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు. ఈ రకమైన గళం పితృస్వామ్య వ్యవస్థకు ఒక బెదిరింపుగా ఉంది. కొన్ని రకాలైన హింసా పద్ధతులు గతం నుంచి కొనసాగుతున్నాయి. నిమ్న కులాలు, జాతులు పట్ల వాటికి సంబంధించిన మహిళల పట్ల హింస గతం నుండి కొనసాగుతూనే ఉంది. గతమెంతో ఘనంగా ఉందని చెప్పుకోవడం వలన ఉపయోగం లేదు. మహిళలు ఎక్కువ విద్యావంతులై బయటికి వెళ్లగలిగే పరిస్థితి ఉంటే వరకట్న సమస్య తీవ్రమవడమే కాక కొన్ని కొత్త రూపాలతో ముందుకోస్తుంది. వరకట్నం, దానికి సంబంధించిన హింస స్వరూపం మారిపోయింది. వరకట్న సమస్య ఆస్తులతో ముడిపెట్టబడింది. ఇపుడు మహిళలు పొందుతున్న తండ్రి ఆస్తిలో వాటా హక్కుతో కూడా ముడిపెట్టబడింది. ప్రజల జీవన విధానంలోనే పెద్ద మార్పు వచ్చింది. ముఖ్యంగా మీడియా, వినిమయ వస్తువుల ప్రకటన దారులు నిరంతరం వెంపర్లాడే ఎగువ మధ్య తరగతి వర్గాల్లో జీవన విధానంలో పెద్ద మార్పు వచ్చింది. కనుక విద్యావంతులై ఉండి ఉద్యోగం చేస్తున్న యువతి కూడా కట్న కానుకలతో కూడుకున్న వైభోవోపేతమైన వివాహం జరగాలని కోరుకుంటుంది. చాలా టివి సీరియళ్లలో కూడా ఇలాంటి ఆడంబరాలు చిత్రీకరించి వాటిని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని వార్తాచానల్స్‌ అయితే ఏకంగా వారి వివాహాన్ని లైవ్‌షోగా పెట్టి చూపిస్తున్నాయి. ధనిక హిందూ కుటుంబాల్లో ప్రామాణికంగా భావిస్తున్న ఇటువంటి ఆడంబరాలు మిగిలిన ఇతర పేద వర్గాలకు, కులాలకు పాకింది. దీనితో వరకట్నం కొత్త స్వరూపంతో ముందుకొచ్చింది. మహిళలపై పెరుగుతున్న లైంగిక హింస ఇంకొక పెద్ద అంశంగా ఉంది. పూర్వకాలంలో మహిళలు ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉంటారని చెప్పేవారు. కానీ మహిళలు ఇళ్లల్లో కూడా నిరంతరం హింసను ఎదుర్కొంటునే ఉన్నారు. ఇప్పుడు మనం దీనిని హింసగా గుర్తించగలుగుతున్నాం. మొత్తం సమాజమే హింసాపూరితంగా మారుతుంది. పోటీతత్వం, దురాక్రమణ తత్వం ఎక్కువగా వున్న కార్పొరేట్‌ సాంప్రదాయాలు ప్రబలడంతో హింస పెరగడమే కాక బలహీన వర్గాలు ఈ హింసకు బలవుతున్నారు. దీని ప్రభావంగా నేడు బిపిఓలలో, కార్పొరేట్‌ సంస్థలలో లైంగిక వేధింపులు అధికమయ్యాయి. గతం నుండి వస్తున్న హింసాత్మక ధోరణులు తిరిగి పునరావృతమవున్నాయి. ఉద్యోగుల స్వభావం పూర్తిగా మారిపోయింది. నూతన విధానాలతో మహిళలు ప్రధానంగా కాంట్రాక్టు పద్దతిలోనే ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులైతే కొన్ని చట్టబద్దమైన సౌకర్యాలు, భద్రత ఉంటాయి. పర్మినెంట్‌ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలోకి మారడం, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగావకాశాలు పెంచటం మహిళల ఉపాధి పరిస్థితినే పూర్తిగా మర్చివేశాయి. ఉద్యోగులు పొందిన కొన్ని హక్కులను ఈ విధానంలో వదులుకోవలసి వస్తుంది. వేరొక పక్క మధ్య తరగతి వారికి ఆపైన వర్గాల వారికి కొన్ని అవకాశాలు పెరగడంతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. దీనిని ఆర్థికవేత్తలు ఉపాధి లేని అభివృద్ధి కాక ఉన్న ఉపాధి పొగొట్టే అభివృద్ధిగా చెబుతున్నారు. దీని అర్ధం ఇప్పుడు పురుషులకు ఉద్యోగావకాశాలు దొరకడం లేదు. మహిళలు తమను మరింత దోచుకునే పరిస్థితులో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. చాలామంది మహిళలకు ఉద్యోగ పరిస్థితులు అననుకూలంగానే ఉన్నాయి. ముందెన్నడూలేని రీతిలో మహిళాకార్మికుల వలసలు అసాధారణంగా పెరిగిపోయాయి. అణగారిన బడుగువర్గాలకు చెందిన మహిళలు కొన్ని రకాల పనుల కోసం వలసలు వెళ్లినపుడు రకరకాల వేధింపులకు గురికావలసి వస్తుంది. కొన్నిసార్లు మహిళల అక్రమ తరలింపును వేరువేరుగా చూడలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరళీకరణ విధానాల యుగంలో వలసలు వెళ్లడానికి స్వేచ్ఛ వచ్చిందనే భావన ఉంది. కాని మహిళలు తమ ఇష్టప్రకారం వలసలు వెళ్లడం తగ్గి అక్రమ తరలింపు ప్రారంభమయ్యింది.
ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టాలకు అవసరమైన మార్పులను సూచించడం, కొన్ని విధానాలను కొన్ని కొత్త చట్టాలను ప్రతిపాదించడం మహిళా కమిషన్‌ ప్రణాళికలో భాగంగా ఉంది. గత 20 సంIIల కాలంలో మహిళా కమిషన్‌ అనేక విషయాలలో జోక్యం చేసుకొని పనిచేసింది. కమిషన్‌ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేయడం మాత్రమే చేయగలుగుతుంది. గత 10 సంIIల కాలంలో చేసిన కొన్ని ప్రతిపాదనలు పరిశీలిస్తే అత్యాచారానికి గురైన బాధిత ప్రతిపాదించింది. లైంగిక వేధింపులకై ఒక సమగ్ర చట్టం తేవాలని దేశ వ్యాప్తంగా పెద్ద వర్క్‌షాపు నిర్వహించారు. ఈ విషయంలో కమిషన్‌ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సాయం తీసుకుంది.
దీనిపై ఒక చట్టం తయారు చేసిన బిల్లుపై చర్చించారు. తరువాత దానిని ఆమోదించారు. అత్యాచారాన్ని నిరోధించడంలోనూ బాధిత మహిళల పునరావాసానికి సంబంధించిన అంశాలలోనూ, ప్రత్యేకించి బాలికలు అత్యాచారానికి లైంగిక వేధింపులకు గురైనపుడు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యల గురించి ఇందులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి ప్రత్యేక చట్టమేమీ లేదు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించిన బిల్లు ప్రతిని తయారు చేయడానికి కమిషన్‌ న్యాయవాదుల సహాయం తీసుకుంది. జాతీయంగా ఈ విషయంపై సంప్రదింపుల తరువాత తయారైన ఈ బిల్లును ప్రభుత్వానికి పంపించారు. లింగ నిర్ధారణ నిరోధక చట్టం విషయంలో కూడా జోక్యం చేసుకోని చట్టం ఇంకా సమర్ధవంతంగా అమలు కావడానికి చట్టంలో చేయాల్సిన మార్పులను సూచించారు. బాలికల నిష్పత్తి పడిపోవడం గణాంక పరంగానే కాక సాంఘిక పరంగా కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. తక్కువమంది మహిళలుంటే వారి విలువ పెరుగుతుందని కొంతమంది వాదిస్తున్నారు. కనుక చట్టాల వలన కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/