ఏకత్వం

బాలగేయం

SHINE
SHINE

ఏకత్వం

రంగులు వేర్వేరు బట్టల దార మొకటే!
పలు ఆభరణాలు వేరు
బంగారము ఒకటే!
ఆవుల రంగు వేర్వేరు
పాల రంగు ఒకటే!
బీదా గొప్పా వారలైనా
శారీర బాధ ఒకటే!
శరీరాలు వేర్వేరు
ఆత్మలు ఒక్కటే!
మతాలన్ని వేర్వేరు
అందరి దేవుడు ఒకడే!
దీపం రవి కిరణం వేరు
వెలుగన్నది ఒకటే!
దేశ దేశాలు వేర్వేరు
ప్రపంచం ఒకటే! తరచి చూడ చూడ
విశ్వమ్ము ఒక్కటే!కలిసి మసిలిన బేధాలు
బాధలు ఖేదాలు లేని
బాలల ఘనత ఒకటే!!

– ఎల్‌. రాజాగణేష్‌, పాతగాజువాక, విశాఖపట్నం