ఏఐసీసీ అధికార ప్రతినిధిగా జైపాల్‌రెడ్డి నియామకం

Jaipal reddy
Jaipal reddy

హైదరాబాద్‌: మాజీ కేంద్ర మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డిని ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నియమించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం సీనియర్‌ నేతగా కొనసాగుతున్న జైపాల్‌రెడ్డి గతంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా పార్టీ అధిష్టానంతో మంతనాలు సాగించారు.