ఏఐసిసి కార్యదర్శిగా సందీప్‌ దీక్షిత్‌

sandeep dixit
sandeep dixit

న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసిసి) కార్యదర్శిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపి సందీప్‌ దీక్షిత్‌ను పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం నాడు నియమించారు. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. దీక్షత్‌ ప్రజాసంబంధాల వ్యవహారాలను చూసుకుంటారని ఆ ప్రకటన తెలిపింది. 15 వ లోక్‌సభ సభ్యుడైన దీక్షిత్‌ ఢిల్లీకి చెందిన ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.