ఎస్‌బ్యాంకు ఎన్‌పిఎలు తక్కువగా చూపిందా?

yes bank
yes bank

ఎస్‌బ్యాంకు ఎన్‌పిఎలు తక్కువగా చూపిందా?

ముంబయి, మే 15: ప్రైవేటురంగంలోని ఎస్‌బ్యాంకు తన నిర ర్ధక ఆస్తుల వివరాలను దాచిపెట్టి త్రైమాసిక ఫలితాలు ప్రకటిం చిందన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకు నిరర్ధక ఆస్తులు తక్కువగా చూపించి ఫలితాలు ప్రకటించిందని, అంచనా. తమ ఆస్తి అప్పులు రుణాల చట్టాలను పూర్తిగా రిజర్వు బ్యాంకుకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని బ్యాం కులు రానిబాకీలపరంగా తప్పుడు సమాచారం అందిస్తు న్నాయన్న ఆరోపణలున్నాయి. వారం ముగింపురోజు ఎస్‌ బ్యాంక్‌ షేర్‌ ధర ఆరుశాతానికిపైగా పతనం అయి 1483.85 కి పడిపోఇయంది. దీనికి కారనం 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఫలితాలను ప్రకటించడమే.

తమస్థూల నిరర్ధక ఆస్తులు 0.76శాతంగా యెస్‌బ్యాంకు చెపుతుంటే ఆర్‌బిఐ ఆడిట్‌లో మాత్రం మొత్తం అడ్వాన్సుల్లో ఐదుశాతంగా ఎన్‌పిఎలున్నట్లు తేలింది. అయితే ఈ విధానం ఒక్క ఎస్‌బ్యాంక్‌కే పరిమితం కాలేదు. మరికొన్ని బ్యాంకులు కూడా ఇదేకోవలో ఉన్నాయి. క్రెడిట్‌స్యూసీస్‌ చెపుతున్న వివరాలను పరిశీలిస్తే యాక్సిస్‌బ్యాంకు ఎన్‌పిఎలు 1.78శాతంగా చెపుతున్నది. ఆర్‌బిఐ ఆడిట్‌లో 4.5శాతంగా ఉందని వెల్లడించింది. అలాగే ఐసిఐసిఐబ్యాంకు వాస్తవ ఎన్‌పిఎలు ఏడుశాతం అయితే బ్యాంక్‌ మాత్రం 5.85శాతం మాత్రమేనని ప్రకటించిందని రేటింగ్స్‌సంస్థ అంచనావేసింది.