ఎస్‌బీఐలో రూ.1.35కోట్లు చోరీ

SBI-
SBI

గాంధీనగర్‌: గుజరాత్‌లోని అమ్రేలి ఎస్‌బీఐ శాఖ నుండి రూ.1.35 కోట్లు చోరీ అయ్యాయి. ఆదివారం, సోమవారం రెండు రోజులు బ్యాంక్‌ సెలవులు కావడంతో మంగళవారం బ్యాంక్‌కు వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో ఉన్న ఓ గదిని బద్దలుకొట్టి ఈ చోరీకి పాల్పడ్డట్టు బ్యాంకు ఉద్యోగులు గుర్తించారు. బ్యాంకు భవనంలోని చిన్నపాటి వెంటిలేటర్‌ను తెరిచి లోపలికి ప్రవేశించారని, అనంతరం నగదును అదే మార్గం గుండా బయటికి చేరవేశారని. ఈ సంఘటన రాత్రి 8:30 నుండి10:30 మధ్యజరిగి ఉంటుదని పేర్కోన్నారు.