ఎస్‌బిఐ లైఫ్‌ ప్రీమియం రూ.647 కోట్లు

sbi

ఎస్‌బిఐ లైఫ్‌ ప్రీమియం రూ.647 కోట్లు

హైదరాబాద్‌, జనవరి 30: ఎస్‌బిఐ లైఫ్‌ కొత్త ప్రాంతీయకార్యాలయాన్ని నగరంలో ప్రారంభించారు. ఐఆర్‌డిఎఐ సభ్యులు నీలేష్‌ సాథే, ఎస్‌బిఐ లైఫ్‌ ఎండి సిఇఒ ఆర్జిత్‌ బసు, డిప్యూటి ఎండి బాదల్‌ చంద్రదాస్‌, ఎస్‌బిహెచ్‌ సిజిఎం హర్‌దయాల్‌్‌రపసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా కొత్త రీజినల్‌ కార్యాలయం ప్రారం భోత్సవ సందర్భంగా ఎస్‌బిఐ లైఫ్‌ ఎండి 73 మంది పేద విద్యార్ధులకు విద్య వసతి కల్పి స్తామని, వారికి ప్రత్యేక శిక్షణ, వైద్యఆరోగ్య సదుపాయా లు అందచేస్తున్నట్లు వెల్లడించా రు. సేవే లక్ష్యం అన్న నినాదం తో ఉచిత విద్యార్ధిగృహం పద్ధతి న ఈ సిఎస్‌ఆర్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటు వివరించారు. మొత్తం కొత్త బిజినెస్‌రంగా ఎస్‌బిఐ లైఫ్‌ 53.4శాతం వృద్ధి ని సాధించిందని, తొమ్మిదినెలల కాలంలో మంచి ఆర్థికవృద్ధి కనబరిచిందన్నారు. హైదరాబాద్‌ రీజియన్‌ ప్రత్యేక వృద్ధిని సాధించిం దన్నారు ఈరీజియన్‌ 31.4శాతం మార్కెట్‌ వాటా తో ఉందన్నారు. అంతేకాకుండా ఎస్‌బిఐ ఏజెంట్‌ల సంఖ్య కూడా ఐదువేలకు మించి ఉందని, కొత్త ప్రాంతీయ కార్యాలయంలో నైపుణ్య వృద్ధి, శిక్షణా కేంద్రం వసతులున్నాయని, డిజిటల్‌ అండర్‌ రైటింగ్‌ విభాగం కూడా ఉందని ఆయన అన్నారు. మొత్తం వ్యక్తిగత బీమా ప్రీమియం వ్యాపారంలో హైదరాబాద్‌ ప్రాంతం 508 కోట్లు సాధించిందని కొత్త వ్యాపార ప్రీమియంపరంగా కూడా 25శాతం పెరిగి 647 కోట్లకు చేరిందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో ఎస్‌బిఐ లైఫ్‌కు 73 కార్యాల యాలున్నాయని అన్నారు. 1200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా పదివేలమందికిపైగా శిక్షణపొందిన ఏజెంట్లు, సలహాదారులు ఐదువేలమందికిపైగా సిఐఎఫ్‌లు పనిచేస్తున్నట్లు వివరించారు.