ఎస్‌బిఐ నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతాదారులకు హెచ్చరిక!

SBI
SBI

న్యూఢిల్లీ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నెట్‌ బ్యాంకింగ్‌కు మీ మొబైల్‌ నెంబరు రిజిస్టర్‌ చేసుకోలేదా? అయితే.. ఈ ఏడాది డిసెంబరు 1వ తేదీ తర్వాత మీ నెట్‌ బ్యాంకింగ్‌ బ్లాక్‌ కానుంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎస్‌బీఐ వినియోగదారుల కోసం తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఖఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్లు.. వెంటనే మీ మొబైల్‌ నెంబరును రిజిస్టర్‌ చేయించుకోండి. లేదంటే డిసెంబరు 1, 2018 నుంచి మీ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిపివేయబడునుగ అని ఎస్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఇచ్చిన గడువు లోపు మొబైల్‌ నెంబరును రిజిస్టర్‌ చేసుకోవాల్సిందిగా సూచించింది.