ఎస్‌బిఐ ఛైర్మన్‌ అరుంధతికి ఏడాది పదవీకాలం పొడిగింపు

arundati
SBI Chairperson Arudati Bhattacharya

ఎస్‌బిఐ ఛైర్మన్‌ అరుంధతికి ఏడాది పదవీకాలం పొడిగింపు

ముంబై, అక్టోబరు 1: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గ జం భారతీయ స్టేట్‌బ్యాంకు ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య పదవీకాలాన్ని ప్రభుత్వం వచ్చే ఏడాది అక్టోబరు వరకూ పొడిగించింది. ఎస్‌బిఐ పరిధి లోనికి నాలుగు అసోసియేట్‌ బ్యాంకుల విలీనం, భారత్‌ మహిళా బ్యాంకు విలీనం ప్రక్రియను సజావుగా ముగించేందుకు వీలుగా ప్రభుత్వం ఈనిర్ణయం తీసు కుంది. భట్టాచార్య మూడేళ్లకాలం అక్టో బరు 2013లో ప్రారంభించారు. ఎస్‌బిఐపరంగా ఛైర్మన్‌గా అరుంధతీ భట్టాచార్య, బి.శ్రీరామ్‌, విజికన్నన్‌, రజనిష్‌కుమార్‌,పికె గుప్తాలు నలుగురు ఎండిలుగా ఉన్నారు. సెప్టెంబరు చివరి నాటికే భట్టాచార్య కాలపరిమితి ముగు స్తుండటంతో ఆమె పదవీకాలం పొడి గింపు అనివార్యం అయింది. ప్రభుత్వం ఇందుకు సంబంధించి బ్యాంక్స్‌బోర్డు బ్యూరోను కూడా అనేక పర్యాయాలు సంప్రదింపు లు జరిపి ఆమె పదవీకాలం పొడిగించేందుకు కసరత్తులు చేసింది. కేబినెట్‌ నియామకాల కమిటీ పొడిగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ ఏడాది జూన్‌ 15వ తేదీనే ఎస్‌బిఐకు నాలుగు అనుబంధ బ్యాంకులు, మహిళా బ్యాంకు విలీనానికి అను మతినిచ్చింది. దీనివల్ల ఎస్‌బిఐ ప్రపంచంలోని టాప్‌ 50 బ్యాంకుల్లో ఒకటిగా నిలుస్తుందని అంచ నా. ఇక ఎస్‌బిఐ నిరర్ధక ఆస్తులు కూడా 73శాతం పెరుగుతాయి. లక్ష కోట్ల వరకూ ఉంటాయి. భారత ప్రభుత్వం ఎస్‌బిఐలో 7575 కోట్ల మూలధన వనరులను అందించింది. ఉద్యోగ సంఘాలతో కూడా ఛైర్మన్‌కు మంచి సత్సంబంధాలు ఉండటంతో విలీనానికి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాబోవని చెపుతున్నారు.