ఎస్‌బిఐ కార్డ్‌ చెల్లింపులకు రూ.100 ఛార్జీ

Rs
sbi

ఎస్‌బిఐ కార్డ్‌ చెల్లింపులకు రూ.100 ఛార్జీ

ముంబయి: నాలుగుమిలియన్ల కస్టమర్ల కుపైగా ఉన్న ఎస్‌బిఐకార్డ్‌ చెక్కుల ద్వారా కార్డు బకాయిలు చెల్లింపులకుగాను రూ.100 చొప్పున ఛార్జిచేస్తోంది. రెండువేల రూపాయల వరకూ ఉన్న బకాయిలకు అదనంగా వందరూపాయలు ఛార్జి చేస్తుంది. ఆపై ఉన్న మొత్తాలకు ఎలాంటిరుసుం ఉండదు. ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచే వీటిని అమలు చేస్తోంది. ఎస్‌బిఐ కార్డుపరంగాచూస్తే డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకేనని స్పష్టం అవు తోంది. రూ.2వేలకు తక్కువ ఉన్న మొత్తాలకు మాత్రమే వందరూపాయలు వసూలుచేయడంలో ఆంతర్యం ఎవ్వరికీ అంతుబట్టడంలేదు క్రెడిట్‌కార్డు కంపెనీగా ఉన్న ఎస్‌బిఐ కార్డ్‌ రెండువేలకుపైబడిన చెక్కులతో చెల్లింపులకు ఎలాంటి అదనపు రుసుం ఉండదని అర్ధం అవుతోంది.

ఎస్‌బిఐకార్డ్‌ సిఇఒ విజ§్‌ు జాసూజా మాట్లాడుతూ 90శాతం మంది తమ కస్టమర్లు నాన్‌చెక్‌ విధానంలోనే చెల్లిపులు చేస్తారన్నారు చిన్నచెక్కు చెల్లింపులవల్ల వివాదాలు ఎదురవుతున్నాయని దీనివల్ల కస్టమర్లకు అసౌకర్యం కలుగుతున్నదని అందువల్లనే అనేక డిజిటల్‌ విధా నాలను అమలుకు తెచ్చామని ఈ విధానం వల్ల డిజిటల్‌ చెల్లింపులవ్యవస్థను మరింత క్రమబద్ధం చేసినట్లవుతుందని సిఇఒ వెల్లడించారు. ఎస్‌బిఐ కార్డ్‌ ఉన్నతి ద్వారా ఎక్కువ మంది చెక్కులతో చెల్లింపులు చేస్తారన్నారు. మొదటిసారి క్రెడిట్‌కార్డు వినియోగదారులను చేర్చుకునేందుకుగానుఈ విధా నం ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. మొత్తం నాలుగుమిలియన్లకుపైబడి కస్టమ ర్లు ఉన్నారు.

దేశవ్యాప్తంగా 90కేంద్రాల్లో ఎస్‌బిఐకార్డు కార్యాలయాలున్నాయి. ఎస్‌బిఐ, జిఇ కేపిటల్‌ జాయింట్‌ వెంచర్‌ గా ఉన్న ఎస్‌బిఐకార్డ్‌ ఈ రెండు కంపెనీల పర్యవేక్షణలో పని చేస్తుంది. జిఇ కేపిటల్‌ బిజినెస్‌ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ఎస్‌బిఐ టెక్నాలజీ అవసరాలను తీరుస్తు న్నది. ఎస్‌బిఐ కార్డ్స్‌చెల్లింపుల సేవల సంస్థ కస్టమ ర్లను రాబట్టి మార్కెటింగ్‌, రిస్క్‌మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ను పర్యవేక్షిస్తుంది. ఎస్‌బిఐ తన వాటాను ఎస్‌బిఐ కార్డ్‌లో 74శాతానికి పెంచుతామని ప్రకటించింది.