ఎస్‌ఎంబి ఇ-కామర్స్‌ లక్ష్యంగా ప్రైవన్‌

ECOMMERCE1
e Commerce

ఎస్‌ఎంబి ఇ-కామర్స్‌ లక్ష్యంగా ప్రైవన్‌

హైదరాబాద్‌, నవంబరు24:దేశవ్యాప్తంగా ఇ-కామర్స్‌ రంగాన్ని మరింత విస్తరింపచేసేందుకు వీలుగా ప్రతి వారం కొత్తగా 350 మంది విక్రేతలను ఈ ప్లాట్‌ ఫామ్‌పైకి కొత్తగా వచ్చిన ప్రైవన్‌ సంస్థ వేదిక అవు తోంది. దేశవ్యాప్తంగా విస్తరించిన 34వేలకుపైగా చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు చెందిన యజ మానులను ఆన్‌లైన్‌ వ్యాపార ప్రపంచంలోనికి ప్రవేశింపచేసి డిజిటల్‌ సాంకేతికపరిజ్ఞానంతో సమర్ధంగా తమ ఉత్పత్తులు అమ్ముకోడానికి అవ కాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 2014లో ప్రారంభం అయినప్పటినుంచి ఎస్‌ఎంబిలకు అవసరమైన శిక్షణ సేవలు అందించడంతోపాటు లాజిస్టిక్‌ వ్యాపార ప్రకటనలకు సంబంధించిన లోతైన సమస్యలకు ప్రైవన్‌ పరిష్కారాలు అంది స్తుందని సేల్స్‌లీడర్‌ సందీప్‌ వారాగంటి వెల్ల డించారు. 2020 నాటికి చిన్న, మధ్యతరహా సమస్యల ద్వారా 100 బిలియన్‌ డాలర్ల వ్యాపా రం చేసే లక్ష్యంతో ఉన్నట్లుప్రైవన్‌ సేల్స్‌లీడర్‌ ప్రకటించారు. ప్రతివారంలోను కనీసం 350 మందికి తగ్గకుండా ఎస్‌ఎంబి యజమానులను ఆన్‌లైన్‌ పైకి తెస్తున్నట్లు వివరించారు. గడచిన రెండేళ్లలో ప్రైవన్‌కు వచ్చి నెస్‌ఎంబిలు 500శాతం పెరిగాయన్నారు. ఉత్పత్తులను కూడా 400శాతం అందుబాటులోనికి తెచ్చారన్నారు. చిన్నమధ్యతరహా వ్యాపారాల్లో పదిశాతం మాత్రమే ఇంటర్‌నెట్‌కు చెందిన పూర్తిసామర్ధ్యం వినియోగించుకోడంలో సాధికారతను కలిగి ఉన్నాయని ప్రైవన్‌ కేవలం తన సొంత బృందంతోనే కాకుండా భాగస్వామ్య నెట్‌ వర్క్‌లతో కలిపి మొత్తం 45నగరాల్లో సేవలం దిస్తున్నట్లు సందీప్‌ వివరించారు. ఎస్‌ఎంబిల్లో తయారయ్యే నమ్‌కీన్‌ల నుంచి బీహార్‌లోని మధు బని ఛాయా చిత్రాలవరకూ ప్రైవన్‌ అందిస్తుంద న్నారు. ప్రస్తుతం రెండు, మూడోశ్రేణి నగరాలపై దృష్టిసారించామని, ఎస్‌ఎంబిలకు అవసరమైన శిక్షణ, డిజిటల్‌ కేటలాగ్‌బిల్డింగ్‌, లాజి స్టిక్‌, వ్యాపార ప్రకటనలకు సంబంధించి న పరిష్కారాలను అందిస్తామని వివరిం చారు. ప్రైవన్‌ మద్దతుతో ఇపుడు తమకు 95శాతం అమ్మకాలు ఆన్‌లైన్‌లోనే జరు గుతున్నాయని చెన్నైకు చెందిన సమైరా ఆన్‌లైన్‌ సంస్థయజమాని ఫహద్‌ వెల్లడిం చారు. అమ్మకాల్లో కూడా ఆరుశాతం వృద్ధిని సాధించామన్నారు. 2016లో ప్రైవన్‌ తన ఎస్‌ఎంబి విక్రేతలను 150 శాతం పెంచుకోవడంద్వారా మరో 15 నగరాలకు విస్తరించిందని సందీప్‌ వివరిం చారు. ఇప్పటివరకూ రెండువేల సంస్థల విక్రేతలకు తమ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉందని, భాగస్వామ్యపద్దతిని ప్రారంభించిన ఏడాదిలోపే 300శాతం వృద్ధిని సాధించినట్లు వివరించారు.