ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు చంద్రబాబు లేఖ

తంబళ్లపల్లెలో కుట్ర జరిగిందంటూ ఆరోపణ

అమరావతి: ఏపి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభ్యర్థుల తుదిజాబితా ప్రచురించలేదని తన లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తంబళ్లపల్లె ఎంపీడీవో, ఎస్ఐలపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే బంధువు భాను, ఎమ్మెల్యే పీఏపైనా ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్న అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు కుట్ర జరిగిందంటూ చంద్రబాబు వివరించారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు.